పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరి హర వీరమల్లు. ఈ చిత్రం ఐదేళ్లుగా సెట్ పైన ఉండడమే కాదు ఎన్నోసార్లు రిలీజ్ తేదీలను మార్చుకుని జులై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే హరి హర వీరమల్లు కథ బావున్నా వీఎఫెక్స్ క్వాలిటీ బాగోకపోవడం, వీరమల్లు సెకండ్ హాఫ్ వీక్ ఉండడంతో వీరమల్లు డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.
థియేటర్స్ లో అభిమానుల అంచనాలను అందుకోలేని వీరమల్లు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది అనే టాక్ వినిపిస్తోంది. హరి హర వీరమల్లు డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోవడమే కాదు వీరమల్లు థియేట్రికల్ రిలీజ్ తేదీని కూడా అమెజాన్ డిసైడ్ చేసింది.
అయితే ఇప్పుడు వీరమల్లు చిత్రాన్ని ఆగష్టు 21 లేదా 22 నుంచి స్ట్రీమింగ్ కి తెచ్చే ఆలోచనలో అమెజాన్ ప్రైమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. హరి హర వీరమల్లు థియేటర్స్ లో నిరాశపరిచిన ఓటీటీలో హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.