మెగాస్టార్ చిరంజీవి - వసిష్ఠ కలయికలో క్రేజీ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న విశ్వంభర ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యాక విశ్వంభర వీఎఫెక్స్ విషయంలో ఎన్నో ట్రోల్స్ నడిచాయి. విశ్వంభర వీఎఫెక్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దానితో దర్శకుడు వసిష్ఠ విశ్వంభర సీజీ వర్క్ విషయంలో చాలా సమయం తీసుకుని చివరకు రిలీజ్ తేదీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు.
అయితే మెగాస్టార్ బర్త్ డే అంటే ఆగష్టు 22 న విశ్వంభర టీజర్ తో పాటుగా రిలీజ్ తేదీ ని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. విశ్వంభర ఫస్ట్ టీజర్ పై వచ్చిన ట్రోల్స్ ఈ మెగాస్టార్ బర్త్ డే టీజర్ చెరిపేసేలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటున్నారట. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఇంప్రెస్స్ అయ్యేలా విశ్వంభర టీజర్ కట్ ఉంది అంటున్నారు.
మరి చిరు ని వింటేజ్ లుక్ లో ఏడు లోకాలను దాటి విశ్వంభర లోకానికి తీసుకెళ్లి మరీ అభిమానులను మెప్పించేందుకు వసిష్ఠ గట్టిగానే సిద్దమవుతున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా.. స్పెషల్ సాంగ్ లో శ్రీలీల నటిస్తుంది.