నిన్న ఆగష్టు 15 న సూపర్ సిక్స్ పథకాల హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఆరంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ పలువురు ఎమ్యెలీలు, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు.
అయితే చంద్రబాబు, పవన్, లోకేష్ లు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడమే కాదు వారు కూడా మహిళ లతో పాటుగా బస్సులో ప్రయాణించారు. చంద్రబాబు బస్సు ఎక్కి మహిళకు జీరో టికెట్ తీసుకుని ఇచ్చారు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కుతూ కండక్టర్ కి డబ్బులిచ్చి టికెట్ కొన్నారు. కానీ నారా లోకేష్ అన్న ఆగాగు నేను టికెట్ తీసుకుంటాను అంటూ పవన్ ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇప్పించారు.
ఆతర్వాత నారా లోకేష్ ఆ డబ్బులిచ్చి పవన్ కి కూడా టికెట్ కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అన్నకు టికెట్ కొన్న లోకేష్ అన్న అంటూ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు సరదాగా కామెంట్లు పెడుతుంటే.. ఇలాంటి అరుదైన దృశ్యాలు సామాన్య ప్రజలకు చూడముచ్చటగా ఉంటుంది.