నిన్న ఆగష్టు 14 గురువారం పాన్ ఇండియా బాక్సాఫీసు వద్ద రెండు క్రేజీ భారీ చిత్రాలు పోటీపడ్డాయి. మన టాలీవుడ్ నటుడు స్టార్ హీరో ఎన్టీఆర్ హిందీలో చేసిన మొట్టమొదటి చిత్రం వార్ 2, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి చిత్రాలు నువ్వా-నేనా అని పోటీపడ్డాయి. మొదటి నుంచి ఈ రెండు చిత్రాలలో ఏది గెలుస్తుంది అనే విషయంలో సోషల్ మీడియాలో మినీ యుద్ధమే నడిచింది.
కూలి-వార్ 2 సినిమాల విడుదలకు ముందు ప్రతి విషయంలోనూ కూలి డామినేషన్ చూపించింది. ప్రమోషన్స్ పరంగాను, టికెట్ బుకింగ్స్ లోను, క్రేజ్ లోను అన్నిటిలో కూలి కే వార్2 కన్నా కాస్త హైప్ ఎక్కువ కనిపించింది. నిన్న విడుదలైన కూలి, వార్ 2 ఈ రెండు చిత్రాల్లో గెలుపు ఎవరిదీ, ఏ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయనే విషయంలో చాలామంది అతృతతో కనిపించారు. ఆ రిజల్ట్ ఏమిటి అనేది ఇప్పుడు తేలిపోయింది.
కూలి, వార్ 2 రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా.. వార్ 2కు కాస్త మంచి టాక్ వస్తే, కూలికి మిక్సడ్ట్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ విషయంలో కూలి నే గెలిచింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత చిత్రాల క్రేజ్, సూపర్ స్టార్ రజిని, కింగ్ నాగ్, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ లాంటి స్టార్ క్యాస్ట్ కూలి ఓపెనింగ్స్ కి కారణమయ్యాయి.
వార్ 2 స్పై యూనివర్స్, అలాగే తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కన్నా కూలి డామినేట్ చెయ్యడానికి అసలు కారణం, ఎన్టీఆర్ కేరెక్టర్ పై ఉన్న డౌట్. ఆయనది గెస్ట్ రోల్ అని, కాదు నెగెటివ్ రోల్ అని జరిగిన ప్రచారం కూడా వార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ తగ్గడానికి కారణమయ్యాయి. అలాగే వార్ 2 కేవలం యాక్షన్ కానీ.. కూలికి భారీ స్టార్ క్యాస్ట్ ఉండడం హెల్ప్ అయ్యింది.
సో ఏ విధంగానైనా కూలి నే ఈ బాక్సాఫీసు బరిలో లో వార్ 2 పై గెలిచింది అనేది తేటతెల్లమైంది. అంతేకాదు ఈ వీకెండ్ లోను కూలి బుకింగ్స్ అదిరిపోతున్నాయి. సో ఫైనల్ వార్ లో గెలుపు ఎవరిది అనేది ఫైనల్ కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది.