తమిళనాట విజయ్ సేతుపతి-నిత్యా మీనన్ కలయికలో తెరకెక్కిన తలైవా-తలైవి చిత్రం అక్కడ సక్సెస్ అయ్యింది. అదే చిత్రం తెలుగులో సార్ మేడం కింద డబ్ అయ్యి ఓ వారం గ్యాప్ లో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తమిళనాట కాదు తెలుగులో కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.
జులై 25 న తమిళనాట విడుదలైన ఈ చిత్రం తెలుగులో మాత్రం ఆగష్టు 1 న థియేటర్స్ లో విడుదలైంది. అయితే థియేటర్స్ లో సక్సెస్ అయిన సార్ మేడం(తలైవా తలైవి ) ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్ర స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసారు మేకర్స్.
ఆగష్టు 22 నుంచి తెలుగు, తమిళంలో సార్ మేడం చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీ లో చూడడానికి రెడీ అవ్వాల్సిందే.