సెలబ్రిటీల ప్రయివేట్ స్పేస్ లోకి దూరే ప్రయత్నం చేస్తే? ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో కొంత మంది సెలబ్రిటీల తీరుతోనే అర్దమైంది. ఇటీవలే జయాబచ్చన్ ముందుకెళ్లి సెల్పీ దిగే ప్రయత్నం ఓ అభిమాని చేస్తే జయాబచ్చన్ అతడి రెక్క పట్టుకుని మరీ పక్కకు ఈడ్చేసింది. ఈ ఘటనపై చాలా మంది జయాబచ్చన్ కు మద్దతుగానే పోస్టులు పెట్టారు. సమయం సందర్భం లేకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ..ఎలా పడితే అలా ఫోటోలు దిగడమేంటని సోషల్ మీడియా వేదికగా మెజార్టీ వర్గం నెటి జనులు మండిపడ్డారు.
అంతకు ముందు రాజమౌళి పరామర్శకు వెళ్లొస్తున్న సమయంలోనూ ఇలాగే ఓ అభిమాని అత్యుత్సాహం చూపే ప్రయత్నం చేస్తే చీవాట్లు పెట్టి పంపించారు. అంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరి గాయి. ఎంతో ఓపికగా ఉండే మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ సందర్భంలో అభిమానిపై సీరియస్ అయ్యారు. శిల్పకళా వేదికగా ఈ ఘటన చోటు చేసుకుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలెన్నో. తాజాగా అలియాభట్ ప్రయివేట్ స్పేస్ లో దూరే ప్రయత్నం కొందరు చేస్తే అమ్మడు చెడుగుడు ఆడేసింది.
ఎన్నడు లేనంతగా అలియా చెడామడా తిట్టి మరీ పంపించింది. మీడియా కెమెరామెన్లు అని కూడా చూడకుండా మండిపడింది. వివరాల్లోకి వెళ్తే ముంబైలో పాడిల్ ఆడేందుకు వచ్చిన అలియాభట్ ను కొందరు ఫోటోగ్రాఫర్లు గమనించారు. దీంతో వెంటనే వెళ్లి టపీ టపీ మని ఫోటోలు తీయడం ప్రారం భించారు. తీసే క్రమంలో అలియా ఉంటోన్న భవంతి లోపలికి కూడా వెళ్లే ప్రయత్నం చేసారు. లోపలికి రావొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసినా? వినలేదు.
దీంతో అలియాభట్ అందరిపై సీరియస్ అయింది. ఇది మీ ఇల్లు కాదు. గెట్ ఔట్ ఫ్రం హియర్ అంటూ బిగ్గరగా అరిచేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటి జనులు అలియాకు మద్దతుగా నిలిచారు. ఫోటోగ్రాఫర్ల తీరు రోజు రోజుకు అవదుల్లేకుండా పోతుం దని...సెలబ్రిటీలకు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.