జగన్ మోహన్ రెడ్డి కి పులివెందుల కంచుకోట. 40 ఏళ్లగా పులివెందులలో వైఎస్సార్ ఫ్యామిలీ హావ నే నడుస్తుంది. అక్కడి ప్రజలు వైఎస్సార్ కి జగన్ కి పలుమార్లు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు పులివెందుల గడ్డపై టీడీపీ జెండా ఎగిరింది. మొదటిసారి పులివెందులలో టీడీపీ పార్టీ విజయకేతునం ఎగురవేసింది.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అయితే జగన్ ఇలాకాలో గత నలభై ఏళ్లగా అరాచక పాలన సాగుతుందా, వైఎస్సార్ కుటుంబానికి భయపడి ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారా, అసలు వారి ఫ్యామిలీకి భయపడి వారు ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం లేదా, వివేకా హత్య కేసు విషయంలో పులివెందుల ప్రజల్లో ఇన్ని అనుమానాలున్నాయా..
అనేలా పులివెందుల ప్రజలు రీసెంట్ గా జరిగిన జెడ్పిటిసి ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేయడమే కాదు దానితో పాటు కొన్ని స్లిప్స్ లో ముప్పైఏళ్ళ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నా, దండాలు అని ఒకరు, వివేకా హత్యకు న్యాయం జరిగేలా చూడమని మరొకరు ఇలా కొంతమంది ఓటు తో పాటుగా వైట్ పేపర్ పై రాసి ఆ బాక్స్ ల్లో వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అది చూసాక ఓట్లు లెక్కిస్తున్న అధికారులు ఆశ్చర్యపోతే జగన్ ఇలాకాలో ఇన్ని దారుణలా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.