ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిబడుతున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. ఆమె నటించిన మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికి ఆమె గ్లామర్ సోకులకు కుర్ర హీరోలు పడిపోయారు. అందుకే ఆమెకు వరసగా సినిమా అవకాశాలు ఇచ్చేసారు. రీసెంట్ గా భాగ్యశ్రీ బోర్సే కింగ్ డమ్ విడుదలయ్యింది. ఆ సినిమా కూడా ఆమెకు సో సో రిజల్ట్ ఇచ్చింది. ఇక వచ్చే నెలలో దుల్కర్ సల్మాన్ తో నటించిన కాంత విడుదలకు సిద్దమవుతుంది. కాంత లో రెట్రో లుక్ లో భాగ్యశ్రీ బోర్సే క్యూట్ గా కాదు కాదు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా లేకపోయినా అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పిక్స్ మాత్రం ఎట్రాక్ట్ చేసేవిలా ఉంటున్నాయి.
తాజాగా చిన్న షార్ట్ లో భాగ్యశ్రీ బోర్సే షేర్ చేసిన పిక్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. వైట్ టాప్ లో చాలా హాట్ గా కనిపించింది. ప్రస్తుతం అమ్మడు గ్లామర్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక కాంత రిలీజ్ అవుతుంటే రామ్ తో భాగ్యశ్రీ బోర్సే నటించిన ఆంధ్ర తాలూకా కింగ్ కూడా లైన్ లోకి వచ్చేసింది.