Advertisement
Google Ads BL

ప్ర‌ముఖ న‌టీమ‌ణుల శ‌త్ర‌త్వం


సినీప‌రిశ్ర‌మ‌లో ఆ ఇద్దరూ వేర్వేరు కాలాల్లో ప‌ని చేసినా, త‌మ హ‌యాంలో టాప్ హీరోయిన్లుగా ఏలారు. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ రాజ‌కీయాల‌లో ఉన్నారు. నేరుగా ఒకే నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాక‌పోయినా.. ఏదో ఒక చోట ఎదురు ప‌డి విమ‌ర్శించుకుంటున్నారు. పార్టీల ప‌రంగా ఒక‌రితో ఒక‌రు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నారు. అంతేకాదు.. సీనియ‌ర్ న‌టి కం ఎంపీపై యువ ఎంపీ ఎప్పుడూ ఏవో కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇవ‌న్నీ ఇటీవ‌ల మీడియాలోను చ‌ర్చ‌గా మారుతున్నారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు.. స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్.... హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ `మండి` నుంచి భాజ‌పా ఎంపీ కంగ‌న రనౌత్. ఈ ఇద్ద‌రికీ మ‌ధ్య కొన్నేళ్లుగా వివాదాలున్నాయి.

Advertisement
CJ Advs

ఇంత‌కుముందు ఓ సంద‌ర్భంలో సినీప‌రిశ్ర‌మ గురించి, ఇక్క‌డి వ్య‌క్తుల గురించి త‌ప్పుగా మాట్లాడారని జ‌యాబ‌చ్చ‌న్ పై కంగ‌న సెటైర్లు వేసింది. మీ కుమార్తెను చిన్న వ‌య‌సులో కొట్టి తిట్టి, లైంగికంగా వేధిస్తే, మీ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్ బెదిరింపులు వేధింపుల గురించి ఫిర్యాదు చేసి ఉరి వేసుకున్న‌ప్పుడు కూడా మీరు ఇదే చెబుతారా?`` అంటూ ప్ర‌శ్నించింది కంగ‌న‌. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్యా విభేధాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. 

ఇటీవ‌ల జ‌యాబ‌చ్చ‌న్ త‌న‌తో సెల్ఫీ దిగేందుకు వ‌చ్చిన యువ‌కుడిని తోసి వేసారని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు మ‌రోసారి త‌న‌తో సెల్ఫీ దిగేందుకు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఒక వ్య‌క్తిని జ‌యాజీ దూరంగా నెట్టేసి చాలా కోపంగా చూసారు. ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్ కావ‌డంతో కంగ‌న దానిపై ఘాటైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌యాబ‌చ్చ‌న్ ను విశేషాధికారం క‌లిగిన చెడిపోయిన మ‌హిళ! అంటూ కంగ‌న‌ దారుణంగా కామెంట్ చేసింది. 

ఆమె అమితాబ్ జీ భార్య కాబ‌ట్టి ఏం చేసినా భ‌రిస్తున్నారు. ఆ స‌మాజ్ వాదీ టోపీ కోడి దువ్వెన‌లా క‌నిపిస్తోంది.. ఆమె కోడిలా క‌నిపిస్తోంది! అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. 

Kangana Ranaut reacts to Jaya Bachchan pushing away selfie-seeking fan:

Most spoilt and privileged: Kangana slams Jaya Bachchan over selfie row
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs