బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష మొదలయ్యింది. బిగ్ బాస్ చదరంగంలో గెలిచి ఎవరు సీజన్ 9 హౌస్ రణరంగంలోకి అడుగుపెడతారు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్షలో గత సీజన్స్ లో విజేతలుగా నిలిచిన అభిజిత్, బిందు మాధవిలతో పాటుగా ఆటగాడు నవదీప్ కూడా ఈ చదరంగం బరిలోకి దిగారు.
ఈ ముగ్గురు ఎంపిక చెయ్యబోయే కంటెస్టెంట్స్ ఈ సీజన్ హౌస్లోకి అడుగుపెడతారంటూ యాంకర్ శ్రీముఖి తో కలిపి వదిలిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్పాట్ లైట్, ఎంట్రీ టికెట్ అంత ఈజీ కాదు అంటూ శ్రీముఖి ఇచ్చిన బిల్డప్, అభిజిత్ కూల్ ఎంట్రీ, బిందు మాధవి పవర్ ఫుల్ లుక్, నవదీప్ కామెడీ అన్ని ఈ ప్రోమోలో హైలెట్ అయ్యాయి.
ఈ ముగ్గురు ఎవ్వరెవ్వరిని సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపిస్తారో అంటూ ఆసక్తికరంగా అగ్నిపరీక్ష ప్రోమో వదిలింది జియో హాట్ స్టార్.