టాలీవుడ్ కింగ్ నాగార్జున తొలిసారి తమిళ్ మూవీ కూలి లో విలన్ గా కనిపించబోతున్నారు. సైమన్ పాత్రలో చాలా బ్యాడ్ గా కనిపిస్తున్నట్టుగా నాగార్జునని కూలి ప్రమోషన్స్ లో నాగార్జున చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి నాగ్ విలన్ అన్నమాట.
లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ నచ్చి హీరో కన్నా తన పాత్రే బలమైన కావడం వలనే సైమన్ కేరెక్టర్ ని ఓకె చేశాను అని నాగ్ చెప్పారు.
అయితే ఈ విలన్ పాత్ర కోసం నాగార్జున ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయంలో చాలా చర్చే నడుస్తుంది. రజినీకాంత్ అయితే కూలి కోసం 150 కోట్ల పారితోషికం అందుకున్నారనే వార్త ఉంది. మరి ఓ హీరో విలన్ కేరెక్టర్ చెయ్యడం అంటే అది భారీ పారితోషికానికి అయ్యి ఉంటుంది.. అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.
అయితే నాగార్జున కూలి కోసం 25-30 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. దర్శకుడు లోకేష్ మాత్రం 50-60 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకోగా.. హీరోయిన్ శృతి హాసన్.. 4 కోట్లు, ఉపేంద్రకు రూ.4 కోట్లు చెల్లిస్తున్నట్లు కోలివుడ్ మీడియా టాక్.