యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా బోల్డ్ గా ఫేమస్ అయిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు ఆ తర్వాత బాగా మోగిపోయింది. ఇప్పుడు సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ లోకి హీరోయిన్ గా అందులోను దీపికా పదుకొనె ని తప్పించి ఆమెను సెలెక్ట్ చేసేసరికి త్రిప్తి డిమ్రి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ గూగుల్ లో త్రిప్తి డిమ్రి గురించి తెగ వెతికేస్తున్నారు.
ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన త్రిప్తి డిమ్రి ని సోషల్ మీడియాలో గ్లామర్ లుక్ చూస్తే అది ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా త్రిప్తి డిమ్రి సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్లాక్ మోడరన్ డ్రెస్ గ్లామర్ లుక్ చూస్తే యూత్ ఫిదా అవ్వాల్సిందే.
ఎప్పుడు బోల్డ్ గా కనిపించే త్రిప్తి డిమ్రి ఈ మోడ్రెన్ గ్లామర్ లుక్ లో మాత్రం బ్యూటిఫుల్ గా కనిపించింది. లూజ్ హెయిర్ తో త్రిప్తి డిమ్రి అందాలను ఆ బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో చూపించిన విధానాన్ని నిజంగా మెచ్చుకోవాలి.