Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్


 సూపర్ స్టార్ రజినీకాంత్ ఏజ్ కి అస్సలు ఇంపార్టన్స్ ఇవ్వరు. వయసును లెక్క చెయ్యకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ వరస సినిమాలతో ఎంత బిజీగా వుంటున్నారో చూస్తున్నారు. ఆయన నటించిన కూలి మరొక్క రోజులో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 షూటింగ్ చాలా వరకు పూర్తి చేసేసారు. 

Advertisement
CJ Advs

ఒకవైపు కూలి రిలీజ్ ప్రమోషన్స్, మరోపక్క జైలర్ 2 షూటింగ్, ఇప్పుడు సూపర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటున్నారని కోలీవుడ్ మీడియా టాక్. న‌టుడు, ద‌ర్శ‌కుడు ఎం.శ‌శి కుమార్ తో ఓ సినిమా చేసేందుకు రజినీకాంత్ ఆసక్తిగా ఉన్నారని, రీసెంట్ గానే శ‌శి కుమార్ సూపర్ స్టార్ ని కలిసి కథ వినిపించారని , దాదాపుగా శ‌శి కుమార్ తో రజినీకాంత్ ప్రాజెక్టు ఓకె అయినట్లే అని తెలుస్తుంది. 

రీసెంట్ గా శ‌శి కుమార్ టూరిస్ట్ ఫ్యామిలితో నటుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయనకు నటుడిగా మంచిమంచి అవకాశాలు వస్తున్నా శ‌శి కుమార్ మాత్రం రజినీకాంత్ కోసం కథ డెవలప్ చెసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు రజినీకాంత్ ను డైరెక్ట్ చెయ్యాలనే కోరిక చాన్నాళ్లుగా ఉందట. సో జైలర్ 2 తర్వాత సూపర్ స్టార్ ను శ‌శి కుమార్ డైరెక్ట్ చేసే ఛాన్స్ లేకపోలేదు అనేది కోలీవుడ్ మీడియా టాక్. 

Sasi Kumar In Line For Rajinikanth:

Rajinikanth Finalise His Next With Director Sasi Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs