ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా మార్కెట్ లోను ఒకటే డిస్కర్షన్ హాట్ హాట్ గా నడుస్తుంది. అదే కూలి vs వార్ 2. ఆగష్టు 14 న విడుదల కాబోయే వార్ 2 గెలుస్తుందా లేదంటే కూలి గెలుస్తుందా అనేది ఈ డిస్కర్షన్ కి అసలు కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి, హృతిక్-ఎన్టీఆర్ ల వార్ 2 ఒకేరోజు పోటీ పడడంతో ఓపెనింగ్స్ విషయంలో, టాక్ విషయంలో, కలెక్షన్స్ విషయంలో అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.
వార్ 2కి ఎక్కువ హైప్ ఉందా, లేదంటే కూలి ని ఎక్కువ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారా అనేది అందరిలో క్రేజీగా నడుస్తున్న ప్రశ్న. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 ని చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యూత్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగులో ఎన్టీఆర్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అటు కూలి లో నాగార్జున విలన్ గా నటిస్తున్నారు.
అలాగే వార్ 2కి నార్త్ అంటే బాలీవుడ్ లోను పిచ్చ క్రేజ్ ఉంది. హృతిక్ రోషన్ ఉన్నారు. అక్కడ కూడా వార్ 2 నే పై చెయ్యి సాధిస్తుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది, అందులోను నాగార్జున విలన్ కాబట్టి కూలి ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. కాకపోతే ఎటు చూసినా ఏపీ, తెలంగాణాలో కాస్త ఎక్కువగా వార్ 2కె ఫెవర్ గా కనిపిస్తుంది.
చూద్దాం ఆగష్టు 14 వార్ 2 నా లేదంటే కూలి నా.. ఎవ్వరు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.