కోలీవుడ్ హీరో ధనుష్ హిందీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు కోడై కూస్తుంది. ఆ వార్తలు చూసిన వారు ధనుష్-మృణాల్ ఠాకూర్ పరిచయం ఎక్కడ, ఎలా జరిగింది, వీరి మద్యలో ప్రేమ ఎప్పుడు పుట్టింది అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ధనుష్ మృణాల్ ఠాకూర్ బర్త్ డే కి వెళ్లడం, అలాగే ఆమె నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ లో కనిపించడమే కాదు, మృణాల్ ఠాకూర్ ను ధనుష్ సిస్టర్స్ సోషల్ మీడియాలో ఫాలో అవడమే కాకుండా వాళ్ళను మృణాల్ కలిసినట్టుగా వార్తలు రావడం నెట్టింట్లో వైరల్ అయ్యింది. తాజాగా మృణాల్ ఠాకూర్ ధనుష్ తో డేటింగ్ రూమర్స్ పై ఫన్నీగా రియాక్ట్ అయ్యింది.
ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఈ రూమర్స్ నాకు కూడా తెలుసు. నిజం చెప్పాలంటే చాలా ఫన్నీగా అనిపించాయి. ఇద్దరం కలిసి కనిపించినంత మాత్రాన ఏదో జరిగినట్టు కాదు. సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ కి ధనుష్ రావడాన్ని అందరూ తప్పుగా అనుకున్నారు. ఆయన ఆ సినిమాకి ఎందుకొచ్చారంటే అజయ్ దేవగన్ తో ధనుష్ క్లోజ్ అందుకే ఆయన ఆ ఈవెంట్ కు వచ్చారు..
అంతే తప్ప మా మధ్యన అంతకన్నా ఏమిలేదు అంటూ మృణాల్ ధనుష్ తో డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.