టాలీవుడ్ లో స్టార్ హీరోల అవకాశాలు రాకపోయినా రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో జోడి కట్టిన బబ్లీ గర్ల్ మెహ్రీన్ కౌర్ రెండేళ్ల ముందువరకు టాలీవుడ్ లో చిన్న, పెద్ద సినిమాలతో ఎప్పుడు బిజీగానే కనిపించేదే. కానీ గత రెండుమూడేళ్ళుగా మెహ్రీన్ కౌర్ హడావిడి టాలీవుడ్ లో కనిపించడమే లేదు.
మెహ్రీన్ కౌర్ సోషల్ మీడియాలో తప్ప సినిమాల విషయంలో అమ్మడు పేరు మాత్రం వినిపించడమే లేదు. ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకుని ప్రస్తుతం ఎక్కువగా విహార యాత్రల్లో కనిపిస్తున్న మెహ్రీన్ కౌర్ చాలా రోజుల తర్వాత తమిళ్ లో ఆమె నటించిన ఓ సినిమా ఈవెంట్ లో గ్లామర్ గా మెరిసింది.
తమిళంలో మెహ్రీన్ నటించిన ఇంద్ర ఆడియో లాంచ్ ఈవెంట్ లో మెహ్రీన్ కౌర్ గ్లామర్ లుక్ చూసి ఈ సినిమా తర్వాత అమ్మడు మళ్ళీ బిజీ అవుతుందా అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా తమిళ సినిమాతో మెహ్రీన్ కమ్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.