బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు, నటుడు ఫైసల్ ఖాన్ తాజాగా ఆమిర్ ఖాన్ పై చేసిన దారుణమైన ఆరోపణల గురించి అందరూ వినే ఉంటారు. అంతలాంటి ఆరోపణలను ఫైసల్ ఖాన్ సొంత సోదరుడు ఆమిర్ పై చేసారు. ఎప్పటినుంచో ఈ ఖాన్ సోదరుల నడుమ వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఫైసల్ ఖాన్ తాజాగా ఆమిర్.. తనని ఓ ఏడాది బంధించాడు.
తిండి, మందులు తప్ప తనకు ఏమి ఇవ్వకుండా, నా ఫోన్ కూడా తీసేసుకుని, నా రూమ్ బయట బాడీ గార్డ్స్ ని పెట్టి మానసికంగా బాధపెట్టారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఫైసల్ ఖాన్ ఆమిర్ పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ తన సోదరుడు ఆరోపణలపై స్పందించాడు. తన ఫ్యామిలీ నుండి మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
ఇది ఫ్యామిలీ ప్రాబ్లెమ్. కానీ దీనిని ఒక గాసిప్ లాగా మార్చొద్దని, తన తమ్ముడి విషయంలో ఏ నిర్ణయమైనా తన ఫ్యామిలీ మొత్తం కలిసే తీసుకుంది అని, ఎంతోమంది డాక్టర్స్ ను సంప్రదించాక తనకు వైద్యం అందించామని, ఎప్పుడూ తన సోదరుడి శ్రేయస్సు కోసమే ఆలోచించామని ఆ నోట్ లో ఆమిర్ ఫ్యామిలీ స్పష్టం చేసింది. ఇకపై ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దని ఆమిర్ ఖాన్ ఫ్యామిలీ మీడియాను విన్నవించుకుంది.