వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ అభిమానుల నడుమ అంగరంగ వైభవముగా జరిగింది. దర్శకుడు అయన్ ముఖర్జీ, స్టార్ హీరో హృతిక్ రోషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ, దిల్ రాజు హాజరైన ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాదు హృతిక్ తో కలిసి సరదాగా కనిపించి అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేసారు.
ఇక వార్ 2 నిర్మాతలు, టెక్నీకల్ టీమ్ కి ఎన్టీఆర్ థాంక్స్ చెబుతున్న సమయంలో ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చెయ్యడమే కాకుండా జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటూ అరుపులతో మోత మోగించిన అభిమానులపై ఎన్టీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ.. తన స్పీచ్ ఆపి మీరు కాస్త సైలెంట్ గా ఉంటె నేను ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను, ఇక్కడే మైక్ పెట్టేసి వెళ్లిపోవడం ఒక్క సెకన్ పని అంటూ ఎన్టీఆర్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఆతర్వాత హృతిక్ రోషన్ తో డాన్స్ గురించి మట్లాడుతూ.. హృతిక్ రోషన్ ఇండియా టాప్ డాన్సర్ అంటూ కితాబునిచ్చేసారు. హృతిక్ రోషన్ తో కలిసి కనిపించడం చాల హ్యాపీ గా ఉంది, తనకు ముంబై అంటే అసలు ఇష్టముండదు, కానీ వార్ 2 మేకర్స్ నాకు ఆ ఫీల్ లేకుండా చేసారు అంటూ ఎన్టీఆర్ అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు.
పనిలో పనిగా ఇండియన్ సినిమా ఎల్లలు చెరిపేసి రాజమౌళి కి ఎన్టీఆర్ వార్ 2 ఈవెంట్ లో థాంక్స్ చెప్పేసారు. రామోజీరావు గారు తనని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా.. నిన్ను చూడాలని సినిమా ఓపెనింగ్ రోజు నాతొ పాటుగా నా తండ్రి, నా తల్లి మాత్రమే ఉన్నారు. అప్పుడొక ఏకైక అభిమాని ఉండగా.. ఇప్పుడు వేలాదిగా నాతో ఉన్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞలు తెలియజేసారు.