టాలీవుడ్ యంగ్ నిర్మాత నాగవంశీ ఈ ఏడాది డాకు మహారాజ్, కింగ్ డమ్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ వార్ 2 తెలుగు రాష్ట్రాల హక్కులను కొనుగులు చేసారు. దేవర తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్2 ను నాగవంశీ రిలీజ్ చేస్తూ ఉండడంతో అందరిలో విపరీతమైన అంచనాలున్నాయి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.
ఈ ఈవెంట్ లో నాగవంశీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎనర్జిటిక్ స్పీచ్ తో ఉత్సాహపరిచారు. వార్ 2 సినిమా చూసాక టాలీవుడ్ డైరెక్టర్స్ కంటే బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించారని ఆడియన్స్ డెఫ్ నెట్ గా ఫీల్ అవుతారు. హృతిక్ రోషన్ కు తెలుగులోకి గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నాం.
దేవర చిత్రానికి ఎంత ప్రేమ చూపించారో.. తెలుగులో వార్ 2కు అంతకు పదిరెట్లు ఎక్కువ ప్రేమ చూపించాలి, హిందీ కన్నా వార్ 2కి తెలుగు లోనే ఎక్కువ కలెక్షన్స్ రావాలి. దేవరకంటే పదింతలు ఎక్కువ వార్ 2కు ఓపెనింగ్స్ తీసుకురావాలి. ఇది ఎన్టీఆర్ అభిమానుల బాధ్యత. తారక్ అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా మనం చేయాలి.. అంటూ నాగవంశీ వార్ 2 ఈవెంట్ లో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.