హీరో కమ్ విలన్ జగపతి బాబు ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, అలాగే భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా వున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే జగపతి బాబు హోస్ట్ గా ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ఓ షో రాబోతుంది. జయమ్ము నిశ్చయమ్మురా అంటూ జగపతిబాబు కొన్ని రోజులుగా ఈ టాక్ షో పై అంచనాలు పెంచుతున్నారు.
ఇప్పుడా షో ప్రసారమయ్యేందుకు రంగం సిద్దమైంది. జగపతి బాబు గెస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా షో కి ఫస్ట్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారో తెలుసా.. జగపతి బాబు తన ఫ్రెండ్ నాగార్జున ను ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా పిలిచారు. జయమ్ము నిశ్చయమ్మురా అవ్వాలంటే ఒక స్నేహితుడు కావాలి అంటూ నా స్నేహితుడు అనగానే నాగ్ ఎంటర్ అయ్యారు.
సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో ఇది అని జగపతి బాబు అనగానే నాగ్ రా వెల్దామంటూ కవ్వించారు. షూటింగ్ లో ఉండుండడు, గోవాలో వేరే డేట్ కి వెళ్ళుంటాడు అని చెప్పావ్ అంట అని జగపతి బాబు అడగగానే.. గుర్తుపెట్టుకో నువ్వే దొరుకుతావు అంటూ నాగ్ అన్నారు. రమ్యకృష్ణ-టబు ఇద్దరిలో ఎవరు ఇష్టమంటే.. దానికి నాగ్ కొన్ని చెప్పకూడదు, చెప్పను అన్నారు.
నేనేదో చిన్నా చితక కేరెక్టర్స్ చేసుకుంటూ బ్రతికేస్తుంటే.. నువ్వు మధ్యలో విలన్ చెయ్యడమేమిటి ఆ మేటర్ ఏమిటో చెప్పమని జగపతి బాబు అడిగారు.. దానికి నాగ్ ఒకడు పుట్టగానే ఎవడి చేతిలో పోతాడు అనేది వాడి తల మీద రాసిపెట్టి ఉంటుంది అంటూ నాగ్ కూలి డైలాగ్ తో అద్దరగొట్టేసారు.. దానికి సూపర్ అంటూ జగపతి బాబు చెప్పిన ప్రోమో వైరల్ గా మారింది.