మెగా హీరోలైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంతో బిజీగా వున్నారు. అలాగే వరుణ్ తేజ్ తన సినిమాలు తను చేసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు షూటింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ మెగా హీరోలంతా జిమ్ లో బీస్ట్ లుక్ లో కనిపించారు. రామ్ చరణ్ షాట్ లో పెద్ది లుక్ కోసం పెంచిన ఫుల్ హెయిర్ తో జిమ్ లో కష్టపడుతున్నారు.
ఇంకా వరుణ్ తేజ్, సాయి ధరమ్ ఇద్దరూ రామ్ చరణ్ తో కలిసి జిమ్ లో సండే సెల్ఫీ దిగారు. మెగా హీరోలంతా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ దిగిన పిక్ లో ఆ వెనుకగా జిమ్ ట్రైనర్ కనిపించారు.
ఇక నిన్న శనివారం రక్షా బంధన్ కి మెగా హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు మెగా సిస్టర్స్ సుశ్మిత, నిహారికలతో రాఖి కట్టించుకున్న ఫొటోస్ షేర్ చేసారు.