యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వరు కదా.. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అయితే హైదరాబాద్ లో ప్రతిరోజూ వరుణ దేవుడు దడదడ లాడిస్తున్నారు. హైదరాబాద్ మొత్తం అతి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది.
ప్రతి రోజు ఈవెనింగ్ లేదంటే నైట్ భారీ నుంచి అతిభారీ వర్షాలు హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఉదయం ఎండ, సాయంత్రం వర్షం అన్న రీతిలో హైదరాబాద్ మారిపోయింది. వర్షం పడితే ట్రాఫిక్ జామ్, రోడ్లన్నీ జలమయంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మరి వార్ 2 ఈవెంట్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా హాజరవుతారు. మేకర్స్ పర్మిషన్ తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వరుణ్ దేవుడు కరుణించాలి, ఎన్టీఆర్ అన్న స్పీచ్ వినేవరకు వర్షం పడకుండా ఉండాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ పబ్లిక్ లోకి ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఈ ఈవెంట్ పై విపరీతమైన క్రేజ్ అభిమానుల్లో ఉంది. మరి వీరిని వరుణ దేవుడు డిజప్పాయింట్ చెయ్యకుండా ఉంటే చాలు.