గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న పెద్ది పాన్ ఇండియా చిత్ర షూటింగ్ ప్రస్తుతం సినీకార్మికుల సమ్మెతో బ్రేకులు పడ్డాయి. రామోజీ ఫిలిం సిటీలో జరిగే షూట్ కి యూనిట్ విరామం ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే 50 పర్సెంట్ పైనే షూటింగ్ ఫినిష్ కాగా.. డిసెంబర్ నాటికి మిగతా బ్యాలెన్స్ షూట్ ని బుచ్చిబాబు ఫినిష్ చేస్తారని, మార్చి 27 చరణ్ బర్త్ డే కి పెద్ది రావడం పక్కా అని తెలుస్తుంది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. విలన్ గా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. అయితే పెద్ది లో స్పెషల్ సాంగ్ కోసం కిస్సిక్ బ్యూటీ, వైరల్ వయ్యారి శ్రీలీల ని సెలెక్ట్ చేసుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఊ అంటావా మావ సాంగ్ చేసిన సమంత ని పెద్ది స్పెషల్ సాంగ్ కోసం అనుకుంటున్నారట.
రంగస్థలంలో రామ్ చరణ్ సరసన నటించిన సమంత పేరు పెద్ది స్టార్ట్ అయినప్పటి నుంచి వినిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం పెద్ది స్పెషల్ సాంగ్ కి సమంత ను ఒప్పించాలని బుచ్చిబాబు చూస్తున్నారట. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పెద్ది స్పెషల్ కోసం కదులుతుందేమో చూడాలి.