కెరీర్ పరంగా తీవ్రమైన ఫ్లాపులతో క్రైసిస్ లో పడిపోయిన ఓ ప్రముఖ హీరో, తనను వెండితెరకు పరిచయం చేసిన పెద్ద నిర్మాణ సంస్థను వదిలి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా అతడు తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. ఈ పెద్ద బ్యానర్ అతడిని వెండితెరకు పరిచయం చేయడమే గాక, వరుస చిత్రాల్లో అవకాశాలు కల్పించింది. కానీ ఎక్కడ చెడిందో అతడు ఆ కంపెనీని విడిచి వెళ్లిపోయాడు! అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ ప్రముఖ హీరో ఎవరో కాదు.. రణ్ వీర్ సింగ్. బ్యాండ్ బాజా బారాత్ చిత్రంతో వైఆర్ఎఫ్ సంస్థ అతడిని వెండితెరకు పరిచయం చేసింది. కానీ ఆ బ్యానర్ ని వదిలి అతడు బయటకు వెళ్లిపోవడం ఆశ్చర్యపరిచింది.
అయితే అప్పట్లో జరిగిన విషయాల గురించి కాస్టింగ్ ఏజెంట్ షాను శర్మ స్పష్ఠతనిచ్చారు. షాను రణ్ వీర్ కి గొప్ప స్నేహితురాలు కూడా. ``నిజానికి ఆరోజు అతడు వెళ్లడం ఎవరికీ బాధ కలిగించలేదు. వెళ్లిపోవడానికి అతడి కారణం అతడికి ఉంది... ఆ నిర్ణయాన్ని సంస్థ అంగీకరించడానికి కారణం లేకపోలేదు!`` అని షాను శర్మ తెలిపారు. తడు అలా వెళ్లిపోవడం వల్ల విభేధాలేవీ తలెత్తలేదు. ఎప్పటికీ అతడు నాకు స్నేహితుడు అని షానూ వ్యాఖ్యానించారు.
2010లో వైఆర్ఎఫ్ నిర్మించిన బ్యాండ్ బాజా బారాత్ చిత్రం కోసం రణ్ వీర్ ని ఎంపిక చేసుకుంది షానూ శర్మ. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ అందుకున్నాడు రణ్ వీర్. ఆ తర్వాత కూడా ఇదే బ్యానర్ లో పలు చిత్రాల్లో నటించాడు. అయితే జయేష్ బాయ్ జోర్ధార్ చిత్రం ఫ్లాపయ్యాక కొన్ని సమస్యలు తలెత్తాయని కథనాలొచ్చాయి. అయితే ఫ్లాపుల కారణంగానే అతడు సంస్థను వదిలి వెళ్లాల్సి వచ్చిందని కూడా కథనాలొచ్చాయి. ఇక్కడ కలవడం విడిపోవడం తిరిగి కలవడం ఒక చక్రం లాంటిదని కాస్టింగ్ ఏజెంట్ షాను అన్నారు.