పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ మొదలు పెట్టబోయే స్పిరిట్ అనౌన్సమెంట్ నుంచే విపరీతమైన క్రేజ్ పెంచుకుంటుంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడమే కాదు ప్రభాస్ కోసం వెయిటింగ్. సెప్టెంబర్ నెల చివరి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిరిట్ సెట్ మీదకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ చిత్రంలో స్టార్ క్యాస్ట్ కూడా ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. హీరోయిన్ గా దీపికా పదుకొనె ను అనుకోవడం ఆతర్వాత ఆమెను తప్పించి తిప్తి డిమ్రి ని ఫైనల్ చేసి అనౌన్స్ చెయ్యడం జరిగిపోయాయి. స్పిరిట్ అంటూ ప్రభాస్-సందీప్ రెడ్డి కాంబో అనౌన్సమెంట్ వచ్చాక ప్రభాస్ కి విలన్ గా కొరియన్ స్టార్ నటిస్తారని ప్రచారం జరిగింది.
కొరియన్ స్టార్ డాన్లీని ప్రభాస్ కి విలన్ గా తేబోతున్నారనే వార్త అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. తాజాగా సందీప్ రెడ్డి ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొనగా.. స్పిరిట్ చిత్రంలో విలన్ ఎవరు అంటూ ప్రశ్నించడమే కాదు, డాన్లీని ఎంపిక చేస్తున్నారా అని కొంతమంది ప్రశ్నించగా.. దానికి సందీప్ వంగ మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అట్లనే అవుద్ది అంటూ హింట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.