Advertisement
Google Ads BL

క‌పూర్ సిస్ట‌ర్స్ క‌థ‌లో ఏకైక‌ అన్న‌య్య


క‌పూర్ కుటుంబంలో అంద‌రూ ఆడ‌పిల్ల‌లే. ఒకే ఒక్క అర్జున్ క‌పూర్ తప్ప మిగ‌తా ఆరుగురు అమ్మాయిలే. బోనీక‌పూర్- సంజ‌య్ క‌పూర్- అనీల్ క‌పూర్ సోద‌రుల‌కు మొత్తం ఆరుగురు కుమార్తెలే. బోనీ త‌న మొద‌టి భార్య‌తో అన్షులకు డాడీ అయ్యాడు. రెండో భార్య శ్రీ‌దేవితో జాన్వీ- ఖుషీ అనే ఇద్ద‌రు అంద‌మైన కుమార్తెల‌ను క‌న్నాడు. బోనీక‌పూర్ సోద‌రుడు సంజ‌య్ క‌పూర్ కి అన్షులా క‌పూర్ అనే అంద‌మైన కుమార్తె ఉంది. ఆ త‌ర్వాత మూడో సోద‌రుడు అయిన ప్ర‌ముఖ న‌టుడు అనీల్ క‌పూర్ కి సోన‌మ్ క‌పూర్-రియా క‌పూర్ అనే కుమార్తెలు ఉన్నారు.

Advertisement
CJ Advs

ఈరోజు రాఖీ పండ‌గ సంద‌ర్భంగా క‌పూర్ కుటుంబ ఆడ‌పిల్ల‌లంద‌రి చిట్టా విప్పాడు సోద‌రుడు అర్జున్ క‌పూర్. త‌న‌కు ఆరుగురు సోద‌రీమ‌ణులు. అన్షులా, జాన్వీ, ఖుషి, రియా, సోన‌మ్, షాన‌యా క‌పూర్ .. వీళ్లంద‌రితో అతడు త‌న బాల్యం నుంచి ఎలా క‌లిసి పెరిగాడో ఆవిష్క‌రించే ఒక అంద‌మైన కొల్లేజ్ ఫోటోని షేర్ చేయ‌గా అది ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. 

క‌పూర్ ఇంటి అమ్మాయిలందరి ఫోటోలతో రూపొందించిన ఈ కొల్లేజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆరుగురు సోద‌రీమ‌ణుల‌తో ఆరు రెట్లు అద‌న‌పు డ్రామా ఉంటుంద‌ని .. గంద‌ర‌గోళం, కొట్లాట‌లు, ప‌రిహాసాలు, వీట‌న్నిటినీ మించి గొప్ప ప్రేమ త‌మ మ‌ధ్య ఉంటుంద‌ని అర్జున్ రాసాడు. త‌న సోద‌రీమ‌ణుల‌కు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపాడు. 

Are there that many Kapoor sisters:

The only elder brother in the Kapoor Sisters story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs