ఈరోజు రక్షాబంధన్. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖి కట్టి ఆశీర్వాదం కాదు కాదు భారీ గిఫ్ట్ లు అందుకునే రోజు. అన్న క్షేమం కోసం చెల్లెలు రాఖి కడుతుంది. అది హిందూ సాంప్రదాయం. తెలంగాణాలో ఈ రాఖి వేడుకలు ప్రతి ఇంట్లోనూ ఘనంగా జరుగుతాయి. ఇక సెలెబ్రిటీస్ ఇళ్లలో రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయాలు వాళ్ళు షేర్ చేసే ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.
మెగా ఫ్యామిలిలో మెగా సిస్టర్స్.. చిరు, పవన్, నాగబాబు లకి రాఖి కడతారు. రామ్ చరణ్ కి ఆయన సిస్టర్స్ సుష్మిత, శ్రీజలతో పాటుగా నాగబాబు కుమార్తె నిహారిక కూడా రాఖి కడుతుంది. తన అన్న వరుణ్ తేజ్ కే కాదు రామ్ చరణ్ కి కూడా నిహారిక రాఖి కడుతుంది. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది నిహారిక.
ఈరోజు రక్షాబంధన్ కి మెగా డాటర్ నిహారిక తన అన్న వరుణ్ తేజ్ కి రాఖి కట్టింది, అలాగే రామ్ చరణ్ కి రాఖి కట్టి అన్నలతో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరుణ్ తేజ్, రామ్ చరణ్ లతో నిహారిక రక్షాబంధన్ సెలబ్రేషన్స్ పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.