Advertisement
Google Ads BL

మహేష్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్


ఈరోజు ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే. ఆయన పుట్టినరోజుని ఘట్టమనేని అభిమానులు అంతగా సెలెబ్రేట్ చేసుకుంటారో మాటల్లో వర్ణించలేము. అంతేకాదు మహెష్ నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ కోసము ఆయన ఫ్యాన్స్ అంతగా వెయిట్ చేస్తారు. అయితే ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలని వారు ఆశించారు. మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి తో మహేష్ బాబు చేస్తున్న చిత్రం నుంచి అప్ డేట్ కోసం వేచి ఉన్నారు.

Advertisement
CJ Advs

కానీ రాజమౌళి మహేష్ బర్త్ డే విషయంలో సైలెంట్ గా ఉండడం వారిని బాగా డిజప్పాయింట్ చేసింది. అయితే రాజమౌళి మాత్రం మహేష్ అభిమానులను నిరాశ నుంచి బయటపడేసే అప్ డేట్ అందించారు. మహేష్ ప్రీ లుక్ పోస్టర్ రివీల్ చేస్తూ.. ఈసినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 2025లో రివీల్ చేయనున్నట్లు తెలిపారు.

రాజమౌళి షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ ధరించి కనిపిస్తున్నారు. ఆ లాకెట్ తో పాటు మెడపై నుంచి రక్తం కారుతూ ఉన్నట్టుగా ఆ పిక్ లో కనిపిస్తుంది. ఆ పిక్ చూసి మహేష్ అసలు లుక్ ని ఊహించుకుని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆ ప్రీ లుక్ తో పాటుగా రాజమౌళి మహేష్ అభిమానుల కోసం ఓ లేఖ రాసారు.

భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినిమా ప్రేమికులారా, అలాగే మహేష్ అభిమానులారా,

మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది, ఈ చిత్రం గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే, ఈ చిత్రం కథ మరియు పరిధి చాలా విస్తృతమైనది, కేవలం పోస్టర్స్ లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు దానికి న్యాయం చేయలేవని నేను భావిస్తున్నాను. మేము సృష్టిస్తున్న ప్రపంచాన్ని చూపించడానికి ప్రస్తుతం మేము ఏదో ఒకదానిపై పని చేస్తున్నాము.

మహేష్ సినిమాకు సంబందించిన అప్ డేట్ నవంబర్ 2025లో రివీల్ చేస్తాము, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా చూపించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము.

మీ ఓపికకు మీ అందరికీ ధన్యవాదాలు.

- ఎస్.ఎస్. రాజమౌళి అంటూ #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. 

Rajamouli delights Mahesh fans:

<span>Rajamouli surprise -&nbsp;</span>Goosebumps for Mahesh fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs