జబర్దస్త్ టీం లోని చాలామంది రోజాని నాగబాబు ని దేవుళ్ళు మాదిరి కొలుస్తారు. వారి వలనే తాము లైఫ్ లో పైకొచ్చామనే భావన భక్తి వారికి ఉంది. కొంతమంది కమెడియన్స్ నాగబాబు కి అండగా జనసేన పార్టీని సపోర్ట్ చేస్తే.. మరికొందరు అంటే ఒకరో ఇద్దరో రోజా ని సపోర్ట్ చేస్తున్నారు. కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్ళు నాగబాబు సైడ్ తీసుకుని రోజా ను నానా మాటలు అన్నాడు. అది కూడా రోజా అన్న మాటలకు కౌంటర్ ఇవ్వడంతో పాటుగా చాలాసార్లు ఆర్పీ రోజా ను టార్గెట్ చేసాడు.
ఆర్పీ కి ఏ ఒక్క జబర్దస్త్ కమెడియన్ సపోర్ట్ చేయలేదు. ఆది, సుధీర్, శ్రీను వీళ్లేవ్వరూ రోజా ను ఎక్కడా పల్లెత్తి మాట అనలేదు కానీ నాగబాబు సైడ్ ఉన్నారు. ఆర్పీ ఒక్కడే రోజా ను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. అయితే రోజాను దేవతలా అమ్మలా పూజించే రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ఒకడు కావాలని రోజాను కామెంట్స్ చేసిన విషయాన్నీ మేము పట్టించుకోము. అన్నం పెట్టిన చేతినే కాలదన్నుకున్నాడు, రోజా గారి వల్ల లాభం పొంది.. ఇప్పుడే ఆవిడనే అంటున్నాడు. ఆ అనేవారు ఇంపార్టెంట్ వ్యక్తి అయితే తిరిగి నేను అనగలను. కానీ అలాంటి వారిని మేము వదిలేశాం అంటూ రాకింగ్ రాజేష్ చెప్పుకొచ్చాడు.
రోజాది తనది అమ్మ కొడుకుల అనుబంధం అని, అందుకే నేను ఆమెతోనే ఉంటాను, జబర్దస్త్ లో నేను పూజించేది ఆవిడనే, ఆవిడ వల్లే ఇలా ఉన్నాను అన్న రాకింగ్ రాకేష్ ఆర్పీ పేరు ఎత్తకుండానే ఆర్పీ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. అలాంటి వేస్ట్ గాళ్లకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాడు మన వాడు అని నా మనసులో ఉంటే.. నేనే వెళ్లి వాడి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడతా. వద్దురా.. తప్పురా అని చెప్పేవాడ్ని. కానీ వాడికి అదే పని అయినప్పుడు మనం ఏం అనగలం.. అంటూ రాకేష్ మాట్లాడాడు.
అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన యాంకర్ తో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటా అని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా. మరి రోజా గారిని బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కట్టడి చేయడం లేదు అంటూ యాంకర్ ని రాకేష్ ప్రశ్నించాడు.
సదరు యాంకర్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని ఆయన అలా అన్నారా నాకు తెలియదు అనగానే.. మీరు ఫ్యాన్ ఏమో నేను కాదు.. అయినా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ఆయన ఎందుకు స్పందించడం లేదో అంటూ రాకింగ్ రాకేష్ పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ పంచ్ లు పేల్చాడు.