హిందీ నటి మృణాల్ ఠాకూర్ కు బాలీవుడ్ లో అస్సలు కలిసి రావడంలేదు, సీరియల్స్ నుంచి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో షాక్ ల మీద షాక్ లే తగులుతున్నాయి. సౌత్ లో సీతారామం చిత్రంతో ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్ కు ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కొద్దిపాటి షాకిచ్చాయి.
ఆపై మృణాల్ ఠాకూర్ మళ్లీ హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్ధార్ 2 రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు కూడా సినిమాపై ఎలాంటి హైప్ లేకపోవడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
మరోపక్క ఈ సినిమాకొచ్చిన నెగెటివ్ టాక్ తో వీకెండ్ తో పాటుగా వీక్ డేస్ లోను థియేటర్స్ ఖాళీగా కనిపించడంతో సన్ ఆఫ్ సర్ధార్ 2 డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అలా మృణాల్ ఠాకూర్ కేరీర్లో మరో ప్లాప్ పడింది. ఆమెకి బాలీవుడ్ కలిసి రావడం లేదు అనే ప్రచారం మరోసారి నిజమైంది. మృణాల్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ డెకాయిట్ లో నటిస్తుంది.