ఇది ఆరోపణ కాదు కానీ.. తన అసౌకర్యాన్ని స్టార్ హీరో ముందు వెల్లగక్కినందుకు అతడు ఎలా రియాక్ట్ అయ్యాడో చెప్పింది తమన్నా. రెండు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎంతో దూరం ప్రయాణించింది మిల్కీ వైట్ బ్యూటీ. టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసనా అవకాశాలు అందుకుంది. హిందీలో అక్షయ్, అజయ్ దేవగన్, సల్మాన్ లాంటి పెద్ద స్టార్ల సినిమాల్లో నటించింది. సల్మాన్ తో దబాంగ్ టూర్ లోను పెర్ఫామ్ చేసింది.
అయితే ఓ సౌత్ స్టార్ హీరో సరసన నటించేప్పుడు అతడితో సన్నివేశంలో తాను అసౌకర్యానికి గురయ్యానని చెప్పింది. ఆ విషయాన్ని స్టార్ హీరోకి చెప్పగానే అతడు ఊహించని విధంగా రియాక్టయ్యాడు. హీరోయిన్ ని మార్చండి! అంటూ తన దర్శకుడికి స్పాట్ లో తమన్నా ముఖంపైనే చెప్పేసాడు. అయితే ఆ సమయంలో తమన్నా చాలా కూల్ గా రియాక్ట్ అయ్యానని తెలిపింది. ఆ మరుసటి రోజు సారీ కూడా చెప్పిందిట. తనను రీప్లేస్ చేస్తారని భయపడిపోలేదు.. సీరియస్ గా ఉన్నా కానీ ఆ సన్నివేశంలో మన ప్రవర్తన చాలా ముఖ్యం.
ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎదురు తిరిగి అగ్రెస్సివ్‌గా ఉండకూడదు. ప్రశాంతంగా పరిస్థితిని హ్యాండిల్ చేయాలని లల్లంపాట్‌తో పాడ్‌కాస్ట్ లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా మాట్లాడిన ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఆ సీన్ ఇంటిమేట్ అయ్యే సన్నివేశమా? అని కూడా హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని తమన్నా అన్నారు. ఈ ఘటన తర్వాత కూడా తాను ఆ స్టార్ నుంచి గౌరవం అందుకుంటూనే ఉన్నానని తెలిపింది తమన్నా. తన కూల్ యాటిట్యూడ్ కారణంగానే మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఈరోజు కూడా ఎంతో హ్యాపీగా కెరీర్ బండిని నడిపిస్తోంది.