ప్రస్తుతం టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. పాన్ ఇండియా మూవీస్, చిన్న సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ రెండు.
1.కార్మికుల వేతనాలు పెంచాలి.
2.పెంచిన వేతనాలు ఏరోజు కారోజే ఇవ్వాలి అని చెపుతున్న ఫెడరేషన్ సభ్యులు.
ఈరోజు గురువారామ్ ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్ దిల్ రాజు ను కలవనున్న ఫెడరేషన్ సభ్యులు, అంతేకాకుండా మంత్రి కోమటిరెడ్డి ని, చిరంజీవి ని కలుస్తామని చెప్పిన ఫెడరేషన్ నాయకులు. చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతున్న ఫెడరేషన్ సభ్యులు.
ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కొంతమంది మెగాస్టార్ ఇంటికి వెళ్లి కలిసి చర్చించారు, అంతేకాదు నిన్న బుధవారం నందమూరి బాలకృష్ణ ను కలిసి నిర్మతలు సమస్యపై చర్చించారు.
నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని డిసైడ్ అవుతామని చెపుతున్న ఫెడరేషన్ సభ్యులు. అయితే నిర్మాత విశ్వ ప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అంటున్న ఫెడరేషన్ సభ్యులు
నిన్న నిర్మాత సి కళ్యాణ్ తో భేటి అయిన ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, నేడు జరిగే చర్చలతో కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని ఆశిస్తున్న నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు.