గత వారం కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులను అయితే డిజప్పాయింట్ చెయ్యలేదు. థియేటర్ లో రన్ అవుతున్న కింగ్ డమ్ కి ఈ వారం కూడా హెల్ప్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గరకు రావడం లేదు. ఆగష్టు 14 వార్ 2, కూలి చిత్రాలు రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ వారం వచ్చేందుకు ఎవరూ ధైర్యం చెయ్యలేదు.
ఆగష్టు 8 శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని, రక్షాబంధన్ ని మేకర్స్ ఎవరూ క్యాష్ చేసుకోవడం లేదు. లాంగ్ వీకెండ్ ని వృధాగా వదిలేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం, అలాగే రక్షాబంధన్ హాలిడేస్ వృధా అవుతున్నాయి. ఇక ఆగష్టు 8 శుక్రవారం కేవలం బకాసుర రెస్టారెంట్, అలాగే డబ్బింగ్ మూవీ సు ఫ్రమ్ సో, ఇంకా మహేష్ అతడు రీ రిలీజ్ సినిమాలు మాత్రమే విడుదల కాబోతున్నాయి.
ఈ మూడు సినిమాల్తోనే ఈ వారం ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి, ఇక ఆగష్టు 14 గురువారం వరకు ఆడియన్స్ వెయిట్ చేస్తే చాలు వార్ 2, కూలి రెండు చిత్రాలు వచ్చేస్తాయి... ఆడియన్స్ లాంగ్ వీకెండ్ ఆగష్టు 15, అలాగే కృష్ణాష్టమి లను ఆ రెండు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు.