అసలు కోలీవుడ్ హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ కి ఎలా పరిచయమైంది? ఆమె తో ధనుష్ నిజంగానే డేటింగ్ చేస్తున్నాడా? సడన్ గా ధనుష్-మృణాల్ ఠాకూర్ పై ఈ ఎఫైర్ రూమర్స్ ఎలా వచ్చాయి? అందులోను బాలీవుడ్ మీడియా ఏకధాటిగా ధనుష్-మృణాల్ డేటింగ్ వార్తలపై అప్ డేట్ ఇవ్వడం కామన్ ఆడియన్స్ కు సైతం షాకిస్తుంది.
ధనుష్.. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ లో కనిపించారు. అప్పుడే మృణాల్ తో చెయ్యి కలిపి హగ్ ఇవ్వడమే కాదు.. మృణాల్ ఠాకూర్ బర్త్ డే పార్టీలో ధనుష్ కనిపించడం తో బాలీవుడ్ మీడియా వీరి డేటింగ్ వార్తలను ప్రముఖంగా ప్రచురించింది. మరోపక్క మృణాల్ ఠాకూర్ కోసం కాదు సన్ ఆఫ్ సర్ధార్ 2 ప్రీమియర్ కి ధనుష్ వచ్చింది అజయ్ దేవగన్, కాజోల్ కోసం. కాజోల్ తో ధనుష్ VIP 2 చేసారు అందుకే.. అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉన్న సమయంలో ధనుష్ సిస్టర్స్ కార్తీక, విమల గీతను మృణాల్ ఠాకూర్ కలిసినట్లుగా ప్రచారం షురూ అవడమే కాదు.. మృణాల్ ఠాకూర్ ను ధనుష్ సిస్టర్స్ సోషల్ మీడియాలో ఫాలో అవడంతో ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్ వార్తలకు బలం చేకూరాయి. అయితే ఈ రూమార్స్ పై ధనుష్ కానీ మృణాల్ కానీ స్పందించలేదు.