అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఘాటీ చిత్రాన్ని పదే పదే పోస్ట్ పోన్ చేస్తూ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో పడేసారు మేకర్స్. ఘాటీ రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఘాటీ ట్రైలర్ అంటూ గత రెండు రోజులుగా మేకర్స్ ఆసక్తిని క్రియేట్ చేసారు. ఈరోజు ఆగష్టు 6 న ఘాటీ ట్రైలర్ తో పాటుగా ఘాటీ విడుదల తేదీ సెప్టెంబర్ 5 అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
ఘాటీ ట్రైలర్ లోకి వెళితే విశాఖ మన్యంలో గంజాయి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గంజాయి ని వ్యాపారంగా కొండలోని ఘాట్ల పరిసర ప్రాంతాల్లో జీవించే ఘాటీ చూట్టూ ఈ కథ అల్లుకుంది. అనుష్క విలేజ్ అమ్మాయిలా, భార్య పాత్రలో, యాక్షన్స్ సీన్స్ లో అదరగొట్టింది. విక్రమ్ ప్రభు, అనుష్కలు భార్యభర్తలు కనిపించబోతున్నారు. ట్రైలర్ చివరిలో ఓ వ్యక్తి మెడను కోసే సీన్లో అనుష్క ఉగ్రరూపంలో కనిపించి షాకిచ్చింది.
అనుష్క బొద్దుగానే కనిపించినా ఆ విలేజ్ మహిళగా ఆకట్టుకుంది. విక్రమ్ ప్రభు-అనుష్క రొమాన్స్, అలాగే విలన్స్ ని అనుష్క ఎదుర్కునే సన్నివేశాలు, BGM, క్రిష్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఘాటిలో రిచ్ గా ఉన్నాయి.