వార్ 2 విడుదలకు కేవలం వారం మాత్రమే సమయముంది. ఇప్పటివరకు తెలుగులో వార్ 2ను ప్రమోట్ చెయ్యలేదు. వార్ 2 తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్న నిర్మాత నాగవంశీ వార్ 2 ప్రమోషన్స్ ను ప్లాన్ చెయ్యడం లేదా, కనీసం నాగవంశీ ఇంటర్వూస్ కూడా రావడం లేదు, దేవర సమయంలో చేసిన తప్పునే నాగవంశీ రిపీట్ చేస్తున్నారా..
వార్ 2 చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ ప్లాన్స్ లేకుండా నాగవంశీ కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ను తీసుకొచ్చి కనీసం సోలోగా ఇంటర్వ్యూ అయినా ఇప్పించాలి. హృతిక్ రోషన్ అండ్ టీమ్ తో ఏదో ఒక వార్ 2 ఈవెంట్ ని నాగవంశీ ప్లాన్ చెయ్యలేదా, చేస్తే చెప్పొచ్చుగా అనేది ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన.
దేవర చిత్ర ప్రమోషన్స్ విషయంలో వారు చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వార్ 2 విషయంలోను అదే జరగడంతో నాగవంశీ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బండబూతులు తిడుతూ టార్గెట్ చేస్తున్నారు. తారక్ అన్నా తారక్ అన్నా అంటూ మాట్లాడడం కాదు తారక్ అన్న సినిమా కోసం ఇలా చెయ్యడం కరెక్ట్ ఆ అంటూ నాగవంశీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.