మెగాస్టార్ చిరంజీవి పై కొంతమంది రాజకీయనాయకులు, అలాగే ఆయనంటే పడని నటులు చాలానే విమర్శలు చేస్తారు. ఏ విమర్శకు చిరు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. తాజాగా బ్లడ్ డొనేషన్ ఈవెంట్ కి హాజరైన ఆయన తనపై జరిగే ట్రోలింగ్ గురించి అలాగే తనని విమర్శించేవారు గురించి ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారు.
నేను చాలా రోజులుగా పాలిటిక్స్ కి దూరంగా నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, అయినా నాపై రాజకీయ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య ఓ పొలిటిషన్ నన్ను అకారణంగా నానా మాటలు అన్నారు. ఆ తర్వాత సదరు పొలిటిషన్ ఓ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ ఓ మహిళ ఆ రాజకీయనాయకుడిని నిలదీసింది. చిరంజీవిని అన్నన్ని మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించింది అంటూ ఆమె ఎమోషనలైన వీడియో చూసి ఆమె ఎవరో ఆమె వివరాలు కనుక్కోమని చెప్పాను.
ఆవిడ కొడుకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు కారణంగానే ప్రాణాలతో బయటపడ్డాడని, అందుకే నేనంటే ఆమెకు అంత గౌరవమని తెలిసి చాలా ఆనందపడ్డాను. ఇక సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై ఎందుకు స్పందించరు అని చాలామంది నన్ను అడుగుతారు. నేనెప్పుడూ వాటికి రియాక్ట్ అవ్వను.
ఎందుకంటే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానుల ప్రేవే నాకు రక్షణ కవచాలు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మంచితనమే మాట్లాడుతుంది.. అందుకే వాటిని పట్టించుకోను అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు.