ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి.. అమ్మాయిల కలల రాకుమారుడు. ఫన్ ఫిల్డ్ బోయ్. ఎప్పుడూ గాళ్స్ మధ్యలోనే ఉంటాడు. నైట్ పార్టీల్లో చిల్ చేస్తాడు. బర్త్ డే వేడుకలు, సినిమాల ప్రివ్యూలు, ర్యాంప్ షోలు, విదేశీ విహార యాత్రలు.. అతడు ఎక్కడ ఉన్నా ఒకటే సందడి. ఒర్రీ లేనిదే పార్టీ లేదు. పబ్బు క్లబ్బు అన్నిచోట్లా అతడు ఉండాల్సిందే. అంతగా పాపులరైన ఒర్రీ ఇంతకీ ఉపాధి కోసం ఏం చేస్తాడు? అంటే.. రిలయన్స్ కంపెనీల జాబ్ చేస్తాడని కొందరు చెబుతుంటారు. లేదు నైట్ పార్టీల్లో సంపాదిస్తుంటాడని మరికొందరు హింట్ ఇస్తుంటారు.
ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఒర్రీ 30వ పుట్టినరోజున ఓ లెవల్లో చేసుకున్నాడు. ఈ వేడుకల కోసం 20 మంది గాళ్స్ తో అతడు ఇబిజ లాంటి డెస్టినేషన్ ప్లేస్ కి చేరుకున్నాడు. అక్కడ నీలిరంగు జలాల్లో నచ్చినట్టు గాళ్స్ తో ఎంజాయ్ చేసాడు. బోట్ షికార్లు, ఈత కొట్టడం నుంచి.. ఇబిజ అంతటా కలియదిరగడం వరకూ అతడితో పాటే గాళ్స్ ఒక రేంజులో ఎంజాయ్ చేసారు.
ఈ పార్టీ కోసం ఎంత ఖర్చు చేసాడో కానీ చూస్తుంటే ఇది చాలా కాస్ట్ లీ ఎఫైర్ లాగే కనిపిస్తోంది. అయితే ఒర్రీతో పాటు వచ్చిన స్నేహితుల గుంపులో అజయ్ దేవగన్ - కాజోల్ దంపతుల కుమార్తె నైసా దేవగన్ కూడా ఉంది. పార్టీలో ఒక రేంజులో చిల్ చేసారు వీరంతా. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.