ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతోంది. సంక్రాంతికి అందులోను జనవరి 9 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా రాజా సాబ్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ రాజా సాబ్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.
రాజా సాబ్ షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది, పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆక్టోబర్ కల్లా అంతా పూర్తవుతుంది. ప్రభాస్ అభిమానులు తమ హీరోని జనవరి లో అంటే సంక్రాంతి బరిలో చూడాలనుకుంటున్నారు అంతేకాదు డిస్ట్రిబ్యూటర్స్ కూడా సంక్రాంతికి విడుదల చెయ్యాలని కోరుకుంటున్నారు.. కానీ నార్త్ అభిమానులు డిసెంబర్ లోనే రాజా సాబ్ రిలీజ్ చెయ్యాలని అడుగుతున్నారు. డిసెంబర్ లో హిందీ లో పెద్ద సినిమాలేవీ లేవు.
రాజా సాబ్ నిడివి నాలుగున్నర గంటలు వచ్చింది..(అంటే పార్ట్ 2 పై నిర్మాత హింట్ ఇస్తున్నారా) దానిని ఎడిట్ చేసి కుదించాలి, ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మాస్ కి నచ్చేలా, క్లాస్ కి నచ్చేలా అన్ని ఉంటాయి. ఇంకా సినిమా రిలీజ్ పై డెసిషన్ తీసుకోవాల్సి ఉంది అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు.