రవితేజ కు ధమాకా హిట్ తర్వాత మళ్ళీ హిట్ అనేదే పడలేదు. వరసగా సినిమాలు చేస్తున్నా సరే రవితేజ కు విజయం దక్కడం లేదు. ధమాకా లో శ్రీలీల తో కలిసి రవితేజ వేసిన డాన్స్ మాస్ స్టెప్స్ యూత్ కి కనెక్ట్ అయ్యాయి కానీ.. లేదంటే ధమాకా కూడా ఫెయిల్ అయ్యేది. అప్పట్లో శ్రీలీల డాన్స్ వలనే ధమాకా కి 100 కోట్లు వచ్చాయనే గుసగుసలు కూడా వినిపించాయి.
ఇప్పుడు మరోసారి అదే డాన్స్ స్టెప్స్ రవితేజ సినిమాని నిలబెట్టేలా ఉన్నాయి. రవితేజ-శ్రీలీల మరోసారి జోడీకడుతున్న మాస్ జాతర ఈ నెల 27న విడుదల కాబోతుంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర నుంచి నిన్న మంగళవారం సెకండ్ సింగిల్ వదిలారు. ఆ సాంగ్ లో రవితేజ-శ్రీలీల డాన్స్ ఇరగదీసారు.
మాస్ స్టెప్స్ తో రవితేజ తో పాటుగా డాన్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకుందా అనేలా శ్రీలీల అంతే ఎనర్జిటిక్ గా డాన్స్ చేసింది. రవితేజ ఎనేర్జిటిక్ డాన్స్ స్టెప్స్, శ్రీలల గ్లామర్ దానికి తోడు డాన్స్ స్టెప్స్ ఇవన్నీ మాస్ జాతరకు అదనపు ఆకర్షణ అవుతాయో, లేదంటే మళ్లీ ఆ డాన్స్ మాత్రమే రవితేజ ను నిలబెడుతుందో చూడాలి అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.