Advertisement
Google Ads BL

సంజయ్ క‌పూర్ మ‌ర‌ణం వెన‌క మిస్ట‌రీ ఇదీ


దాదాపు 30 వేల కోట్ల నిక‌ర ఆస్తులున్న సోనాకామ్ స్టార్ గ్రూప్ య‌జ‌మాని, ప్ర‌ముఖ సినీనిర్మాత‌, న‌టుడు సంజ‌య్ క‌పూర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మ‌ర‌ణించాక‌, ఆ కుటుంబంలో బోలెడ‌న్ని గొడ‌వ‌లు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అత్త‌- కోడ‌ళ్ల మ‌ధ్య వివాదం రాజుకుంది. ఆస్తికోసం ఆధిప‌త్య పోరు వేడెక్కించింది. సోనాకామ్ ఆస్తుల‌కు తాను య‌జ‌మాని అనే విధంగా కోడ‌లు ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని, త‌న వ‌ద్ద నుంచి కొన్ని సంత‌కాలు బ‌ల‌వంతంగా తీసుకున్నార‌ని ఆరోపిస్తూ సంజ‌య్ క‌పూర్ త‌ల్లిగారైన రాణీ చేసిన ఫిర్యాదు సంచ‌ల‌నంగా మారింది.

Advertisement
CJ Advs

త‌న‌యుడి మ‌ర‌ణం వెన‌క కుట్ర కోణం దాగి ఉంద‌ని కూడా రాణీ క‌పూర్ ఆరోపించారు. తాను విచారంలో ఉన్న స‌మ‌యంలో త‌న నుంచి సంత‌కాలు తీసుకున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు. అయితే సోనాకామ్ స్టార్ లో తాను మెజారిటీ వాటాదారు అని కూడా రాణీ క‌పూర్ అన్నారు. ఈ మ‌ర‌ణంలో అంత‌ర్జాతీయ కుట్ర దాగి ఉంద‌ని ఆరోపించ‌డం కూడా సంచ‌ల‌న‌మే అయింది.

అయితే తాజాగా లండ‌న్ లోని స‌ర్రే క‌రోన‌ర్ పోలీస్ విచార‌ణ‌లో ఇవ‌న్నీ కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మేన‌ని ప్రూవైంది. సంజ‌య్ క‌పూర్ మ‌ర‌ణానికి గుండెపోటు కార‌ణ‌మ‌ని వైద్యులు ధృవీకరించ‌న‌ట్టు పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చారు. ధ‌మ‌నులు మూసుకుపోవ‌డం వ‌ల్ల గుండెలో ర‌క్తం పంపింగ్ కి స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని, దీని కార‌ణంగా గుండె పోటు వ‌చ్చి స‌హ‌జంగానే సంజ‌య్ మ‌ర‌ణించాడ‌ని కూడా పోలీసులు తెలిపారు. దీంతో ప్రియా స‌చ్ దేవ్ పై అత్త‌గారైన రాణీ క‌పూర్ చేసిన‌వి కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మేన‌ని, ఎలాంటి కుట్ర కోణం లేద‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం సోనాకామ్ స్టార్ గ్రూప్ ప‌గ్గాల్ని కోడ‌లు చేప‌ట్టారు. బోర్డ్ స‌భ్యురాలిగా ముందుకు న‌డిపిస్తున్నారు. సంజ‌య్ క‌పూర్ పోలో ఆడుతుండ‌గా, గొంతులోకి ప్ర‌వేశించిన తేనెటీగ అత‌డి శ్వాస‌నాళాన్ని కుట్టింది. దాంతో అలెర్జీ కార‌ణంగా శ్వాస ఆడ‌లేదు. త‌త్ఫ‌లితంగా అధిక ర‌క్త‌పోటు స‌హా తీవ్ర ప‌రిణామాల‌తో గుండె పోటు వ‌చ్చి ఆయ‌న మ‌ర‌ణించారు.

Sunjay Kapur Death- Mother Alleges:

Rani Kapur Writes To UK Authorities Seeking Deeper Probe In Sunjay Kapur Mysterious Death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs