బెట్టింగ్ యాప్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీస్ కి ఈడీ నోటీసులు ఇచ్చి మరీ ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన హాజరయ్యారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రచారం చెయ్యను అని చెప్పారు.
రానా, విజయ్ దేవరకొండకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వగా తాము విచారణకు హాజరవ్వలేమని, షూటింగ్స్ వలన బిజీగా ఉన్నామని, మరోసారి విచారణకు పిలివాల్సిందిగా కోరడంతో.. విజయ్ దేవరకొండ కు ఆగష్టు 6 న విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చారు.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు ఈడీ విచారణకు నటుడు విజయ్ దేవరకొండ రానున్నారు. రానా కు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు.
బెట్టింగ్స్ యాప్స్ ప్రచారంలో భాగంగా మనీ లాండరింగ్ జరిగినట్లుగా గుర్తించిన ఈడీ అధికారులు పలువురు సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.