వచ్చే గురువారం ఆగస్టు 14 న విడుదల కాబోయే చిత్రాలు వార్ 2, కూలి. ఈ రెండు క్రేజీ చిత్రాల్లో ఏ చిత్రానికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది, ట్రేడ్ లో బజ్ ఉంది అనే విషయంలో సోషల్ మీడియాలో చిన్నపాటి డిస్కర్షన్స్ హాట్ హాట్ గా జరుగుతూనే ఉన్నాయి. తెలుగు నుంచి ఎన్టీఆర్ వార్ 2 హిందీ చిత్రంలో నటిస్తే, అదే తెలుగు నుంచి నాగార్జున కోలీవుడ్ కూలీలో నటించారు.
కూలి లో రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ లాంటి క్రేజీ నటులు ఉన్నారు. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఉన్నాయి. కూలికి అనిరుద్ మ్యూజిక్ ఇరగ్గొట్టేసాడు, వార్ 2కి అదనపు ఆకర్షణ కియారా గ్లామర్ డోస్, కూలీలో మౌనిక సాంగ్ లోని పూజ అందాలను కుర్రకారు జుర్రేస్తున్నారు. కూలి, వార్ 2 రెండు సినిమాల ట్రైలర్స్ వచ్చేసాయి. వార్ 2లో హీరోల యాక్షన్, కూలీలో స్టార్స్ హీరోల స్క్రీన్ అప్పీరియన్స్ ఇలా దేనికి అదే సాటి అన్నట్టుగా ఉంది.
ప్రమోషన్స్ విషయానికొచ్చేసరి కూలి సౌండ్ గట్టిగా వినిపిస్తే వార్ 2 సౌండ్ కేవలం ముంబైలోనే ఆగిపోయింది. సూపర్ స్టార్ రజిని దగ్గర నుచి నాగార్జున, హృతి హాసన్, లోకేష్ కనగరాజ్ లు కూలి ని తెగ ప్రమోట్ చేస్తున్నారు. అటు చూస్తే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ని ఎంతగా ప్రమోట్ చేసినా సౌత్ కి రీచ్ అవ్వడం లేదు.
సోషల్ మీడియాలో కూడా కూలి ముచ్చట ఎక్కువగా కనిపిస్తుంది. వార్ 2కి సంబందించిన న్యూస్ లు చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఈ లెక్కన కూలి సౌండ్ గట్టిగా చేస్తుంటే వార్2 కాస్త కామ్ గా ఉండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.