పాపం సందీప్ రెడ్డి వంగ కి వెయిటింగ్ తప్పేలా లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ బల్క్ డేట్స్ కోసం సందీప్ వంగ వెయిట్ చెయ్యడం వలనే స్పిరిట్ షూటింగ్ మొదలు కావడం ఆలస్యమవుతుంది. ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ ఫినిష్ అయ్యాకే స్పిరిట్ లోకి అడుగుపెట్టాల్సి ఉంది.
కానీ ప్రభాస్ ఆ రెండు సినిమాల షూటింగ్ చేస్తూనే ఉన్నారు. సందీప్ వంగ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ అలాగే హీరోయిన్ ని సెట్ చేసుకుని సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ స్టార్ట్ చెయ్యాలని చూస్తుంటే.. ప్రభాస్ మరోసారి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారు. కారణం రాజా షూటింగ్ పూర్తి కాలేదు, మరోపక్క ఫౌజీ షూటింగ్ చెయ్యాలి.
రాజా సాబ్ కూడా డిసెంబర్ నుంచి వాయిదా పడి సంక్రాంతికి వెళ్లబోతుంది అనే న్యూస్ మొదలైంది. విఎఫెక్స్ పనులు అక్టోబర్ నాటికి పూర్తయినా అక్టోబర్, నవంబర్ లో పాటల చిత్రీకరణ చెయ్యాల్సి ఉంటుంది. సో ప్రభాస్ ఆ రకంగా ఫ్రీ అవ్వరు. అందుకే స్పిరిట్ సినిమా మొదలు పెట్టేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అనే వార్త అభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది.