మాస్ మహారాజ్ మాస్ జాతర ఆగష్టు 27 వినాయక చవితి కి రావడం లేదు, మాస్ జాతర పోస్ట్ పోన్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపించినా రవితేజ కానీ మాస్ జాతర టీమ్ కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. సైలెంట్ గా మాస్ జాతర ఫస్ట్ సింగిల్ అంటూ అప్ డేట్ ఇచ్చి మాస్ జాతర ఈ నెల 27 నుంచి తగ్గేదెలే అంటూ చెప్పకనే చెప్పేసారు.
తాజాగా మాస్ జాతర నుంచి పవర్ ఫుల్ కాదు.. కామెడీ, యాక్షన్ అలాగే పంచ్ డైలాగ్స్ కలగలిపిన టీజర్ ని మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ తో జోడి కట్టిన శ్రీలీల కలయిక ఈ సినిమాపై మంచి క్రేజ్ ని చూపిస్తుంది. వరస ప్లాప్స్ తో ఉన్న రవితేజ మాస్ జాతర తో పవర్ ఫుల్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.
మరి ఫస్ట్ సింగిల్, మాస్ జాతర టీజర్ ని వదులుతూ వినాయక చవితి బాక్సాఫీసు బరి నుంచి తగ్గేదేలే అని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.