హీరోయిన్ హన్సిక మోత్వానీ తన భర్త తో విడిపోతుందా, ఆమె తన భర్త సోహేల్ ఖతురియాకు విడాకులు ఇవ్వబోతుందా, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. హన్సిక కొద్దిరోజులుగా ఆమె భర్త సోహేల్ ఖతురియాతో కలిసి కనిపించడం లేదు. డిసెంబర్ 2022లో హన్సిక సోహేల్ ఖతురియా ను అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకుంది హన్సిక.
కోదిరోజులుగా ఈ జంటపై రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ భర్త సోహేల్ ఖతురియా తో విడిపోతున్నట్లుగా వస్తున్న వార్తలపై హన్సిక ఎలాంటి కామెంట్స్ చెయ్యకుండా సైలెంట్ గా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు హన్సిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె పెళ్లి ఫొటోస్ ను తొలగించడం హాట్ టాపిక్ అయ్యింది.
హన్సిక భర్తతో విడిపోనుంది, విడాకులకు కూడా అప్లై చెసే వుంటుంది, అందుకే ఆమె పెళ్లి ఫోటోలను డిలేట్ చేసింది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక హన్సిక-సోహేల్ ఖతురియా పెళ్లి అప్పట్లో లవ్ షాదీ డ్రామా అటూ డాక్యుమెంటరీ రూపంలో రిలీజ్ చేసారు.