దళితుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై నటి మీరా మిథున్ ను అరెస్ట్ చేయాల్సిందిగా, ఆమెను కోర్టులో హాజరు పరచాల్సిందిగా తమిళనాడులోని న్యాయస్థానం ఆదేశించింది. బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి మీరా మిథున్ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫలితంగా ఆమెను, ఆమె ఫ్రెండ్ శ్యామ్ అభిషేక్‌పై కేసు నమోదు చేసి చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు.
అరెస్ట్ అయిన నెలరోజులకు వారిద్దరూ బెయిల్ పై బయటికొచ్చారు. 2021లో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటికొచ్చిన మీరా మిథున్ ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో మీరా మిథున్‌పై 2022లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కానీ ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
తాజాగా ఆమె ఢిల్లీ వీధుల్లో ఉన్నట్లుగా గుర్తించి ఆమెను కాపాడమని ఆమె తల్లితండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చెయ్యగా.. మీరా మిథున్ ఢిల్లీ పోలీసులు రక్షించి అక్కడున్న హోంకి తరలించినట్లు తెలిపారు.
అయితే ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఈ నెల 11న తమిళనాడులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది.