సెప్టెంబర్ 25 దసరా బాక్సాఫీసు వార్ మాములుగా ఉండదు.. ఏపీ ప్రభుత్వం లో మిత్రత్వం పాటిస్తున్న నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు నువ్వా-నేనా అని పోటీకి దిగడం గ్యారెంటీ.. ఒకే రోజు అఖండ 2, OG రిలీజ్ లు ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా మారడమే కాదు.. అభిమానుల నడుమ అగ్గి రాజేస్తోంది అనుకున్నారు. ఎవ్వరూ సెప్టెంబర్ 25 బరి నుంచి తప్పుకునేదేలే అన్నట్టుగా మాట్లాడారు.
OG ఫస్ట్ సింగిల్ లో కూడా సెప్టెంబర్ 25 రిలీజ్ అంటూ ఖరా ఖండిగా చెప్పారు, మరోపక్క అఖండ 2 మేకర్స్ కూడా ఎట్టిస్థితుల్లో సెప్టెంబర్ 25 నుంచి తప్పుకోమన్నారు. కానీ ఇప్పుడు అఖండ 2 వెనక్కి తగ్గుతుంది అనే వార్త వైరల్ అయ్యింది. అఖండ 2 పోస్ట్ పోన్ నేపథ్యంలోనే OG మేకర్స్ ధైర్యంగా ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారట.
అఖండ 2 చిత్రం OG కారణంగా వెనక్కి వెళ్లడం లేదు, అఖండ తాండవానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతోనే సినిమాని పోస్ట్ పోన్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అది డిసెంబర్ లో రిలీజ్ ఉండొచ్చనే ఉహాగానాలు నడుస్తున్నాయి. బోయపాటి షూటింగ్ పూర్తి చేసిన పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం తీసుకోవడం వలనే అఖండ 2 వాయిదా అనే వార్తలు వినవస్తున్నాయి.