సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవడం అనేది చూస్తుంటాం. అభిమానులు హీరోల సినిమా ఫస్ట్ లుక్స్ ని ట్రెండ్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు ఏకంగా హీరోలే రంగంలోకి దిగి హ్యాష్ ట్యాగ్ ని సెట్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వాళ్ళే వార్ 2 హీరోలు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14 న విడుదలవుతున్న సందర్భంగా హీరోలిద్దరూ సినిమాని అందరికి రీచ్ అయ్యేలా సోషల్ మీడియా ద్వారా మంచి ప్లాన్ చేసారు. ఎన్టీఆర్ vs హ్రితిక్ రోషన్ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చెయ్యడమే కాదు సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరు హీరోలు యుద్ధం ఆరంభించారు.
ఈ హ్యాష్ టాగ్ పై భారీ పోస్ట్ లు మరియు రీపోస్ట్ లతో ఎక్స్ ప్లాట్ ఫామ్ మోత మోగిపోయింది. వార్ మొదలయ్యింది, ఈ హ్యాష్ ట్యాగ్ యుద్ధం గురించి మీకు చెబుతుంది, ఈసినిమాకి సంబందించిన ప్రతి పోస్ట్ కు #HrithikvsNTR అని జోడించండి అని హృతిక్ ట్వీట్ వేస్తె.. అప్ డేట్స్ ప్రత్యేక విషయాలు మాత్రమే పంచుకుంటారా, #NTRvsHrithik హ్యాష్ ట్యాగ్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా.. యుద్ధం మొదలయ్యేది ఇప్పుడే కదా అని ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.
మీరు చెప్పింది బాగానే ఉంది తారక్, కానీ హ్యాష్ ట్యాగ్ మాత్రం నాదే ఉపయోగించాలి. ఈ విషయాన్ని పెద్దది చెయ్యకండి అంటూ హృతిక్ నుంచి మరో ట్వీట్ వచ్చింది, అది చూసిన ఎన్టీఆర్ నేను చెప్పింది బాగుంది అని మీరే అన్నారు, అంటే నేను గెలిచినట్టే కదా అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.