పవన్ కళ్యాణ్ వరసబెట్టి సినిమా షూటింగ్స్ కంప్లీట్ చెయ్యడమే కాదు రెండు నెలల గ్యాప్లో రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని కూడా చక చకా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని హరీష్ శంకర్ చిత్రీకరిస్తున్నారు.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న చోటికి వర్కర్క్ ఫెడరేషన్ ప్రతినిధులు చేరుకొని ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని అడ్డుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బంద్ సైరన్ మోగింది. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
కార్మికులెవరూ షూటింగులకు వెళ్లకుండా తమ నిరసన తెలియజేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నిర్మాతలు మాత్రం అవేమి పట్టించుకోకుండా ముంబై నుంచి సినీకార్మికులను తీసుకొచ్చి ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ చేస్తున్న విషయం తెలుసుకుని వర్కర్క్ ఫెడరేషన్ ప్రతినిధులు ఆ సినిమా షూటింగ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
వర్కర్క్ ఫెడరేషన్ ప్రతినిధులను ఉస్తాద్ యూనిట్‌కి చెందిన భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. ఓ వైపు సినీ వర్కర్లు బంద్ చేస్తుంటే వేరే ప్రాంతాల నుంచి వర్కర్లను తీసుకొచ్చి షూటింగ్ ఎలా చేస్తారని వారు నిలదియ్యడమే కాకుండా కార్మికుల కష్టం పవన్ కళ్యాణ్‌కి తెలియదా అంటూ వారు మండిపడ్డారు.